క్రైమ్/లీగల్

సజీవ దహనం కేసులో నలుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షామీర్‌పేట్, సెప్టెంబర్ 20: మహిళను చితిలో పడేసి యువకుడిని సజీవ దహనం చేసిన కేసులో నలుగురిని షామీపేట పోలీసులు అరెస్టు చేశారు. చేతబడి అనుమానమే ఓ అమాయకుడిని బలిగొన్న ఆ మూఢ నమ్మకమే ఆ యువకుడిని సజీవ దహనం చేసింది. బతికుండగానే చితిలో పడేసి కాలేసేలా పురిగొల్పి, మానవత్వాన్ని మంటల్లో కలిపిన ఈ ఘటనలో చేతబడి చేశాడన్న నెపంతో అంజనేయులు అనే యువకుడిని దారుణంగా హత్య చేసి, చితిపై ఉంచి నిప్పు పెట్టిన నలుగురు వ్యక్తులు మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి అద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన జీ.బాల్‌రామ్, కిష్టయ్య, జీ.నర్సింహ్మతో పాటు రావల్‌కోల్ గ్రామానికి చెందిన బండాల శ్రీరాములును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నలుగురు నిందితులు అంజనేయులు అనే యువకుడని కర్రలు, రాళ్లతో చితకబాది, కాలుతున్న లక్ష్మీ అనే మహిళ చితిపై వేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని డీసీపీ పద్మజ తెలిపారు. లక్ష్మీ చేతబడి ద్వారానే చనిపోయిందని నిందితులు భావించి ఈ దారుణానికి ఒడిగట్టారని డీసీపీ వెల్లడించారు.