క్రైమ్/లీగల్

జగన్ అక్రమాస్తుల కేసు 27కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసును ఈనెల 27కి కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం నాంపల్లిలో ఈ కేసుకు సంబంధించిన వాదనలను ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టుకు వివరించారు. పెన్నా సిమెంట్ అదనపు చార్జిషీట్‌పై నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానం వాదనలు జరిగాయి. ఈ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్, గనుల శాఖ మాజీ వీడీ రాజగోపాల్‌రెడ్డి, డీఆర్వో సుదర్శన్‌రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై వాదనలు కొనసాగాయి. కొత్త ఆధారాలు లేకుండా అదనపు చార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని జగన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది కోర్టును కోరారు.