క్రైమ్/లీగల్

మనీలాండరింగ్ కేసులో 3 చింపాంజీల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తీవ్రమయిన మనీలాండరింగ్ కేసులను దర్యాప్తు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తులో భాగంగా స్థిర, చరాస్తులను జప్తు చేయడాన్ని మనం చూస్తుంటాం. కాని, ఈ ఉదంతంలో ఈడీ మూడు చింపాంజీలను, నాలుగు అమెరికన్ కోతులను స్వాధీనం చేసుకుంది. అవును, ఇది నిజం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వన్యమృగాల స్మగ్లర్‌పై నమోదయిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ వీటిని స్వాధీనం చేసుకుంది. ఈ ఏడు వన్యమృగాలను కోల్‌కతాలోని జంతుప్రదర్శన శాల అధికారులు తమ వద్ద ఉంచుకునేందుకు వీలుగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వీటిని స్వాధీనం చేసుకుంది. తాము పీఎంఎల్‌ఏ కింద వన్యమృగాలను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని కూడా ఈడీ అధికారులు వెల్లడించారు. వన్యమృగాల స్మగ్లర్ సుప్రదీప్ గుహ నుంచి ఈడీ వీటిని స్వాధీనం చేసుకుంది. గుహ అక్రమంగా వన్యమృగాలను కలిగి ఉన్నట్టు పశ్చిమ బెంగాల్ పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు.