క్రైమ్/లీగల్

సమరం వద్దు..సఖ్యతే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, ఫిబ్రవరి 10: కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొని సమయం, ధనం ఆదా చేసుకోవచ్చని జిల్లా జడ్జి డి.తిరుమలరావు అన్నారు. శనివారం నల్లగొండలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో రాజీ పడిన ఫిర్యాదుదారుడికి అతను కోర్టుకు చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. అదాలత్ తీర్పు అంతిమ తీర్పని అన్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులను కక్షిదారుల సమ్మతి మేరకు ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. కుటుంబ వివాదాలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రభాకర్‌రావు, నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. ఉమామహేశ్వర్, జి.శ్రీనివాస చక్రవర్తి, న్యాయమూర్తులు కెవి.వింద్యేశ్వరి, హుసైబ్ అహ్మద్‌ఖాన్, ఎన్.రోజారాణి, కె.రాణి, న్యాయవాదులు గుండె వెంకటేశ్వర్లు, మిర్యాల లెనిన్‌బాబు, నిమ్మల భీమార్జున్‌రెడ్డి, జనిగల రాములు, ఏ.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకున్నారు.
లోక్‌అదాలత్‌లను వినియోగించుకోవాలి
మిర్యాలగూడ టౌన్ : లోక్‌అదాలత్‌ల ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఐ.శైలజాదేవి కోరారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో మెగా లోక్‌అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టు తిరిగి ఆర్ధికంగా,మానసికంగా నష్టపోవడం కన్న రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి నెల జరిగే లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదాలత్‌లో భార్యభర్తలు, బ్యాంకు బకాయిల తదితర కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి పావని, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శోభారాణి, స్పెషల్ మెజిస్ట్రేట్ పి.లక్ష్మినారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.రవీందర్‌రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, ఏపీపీలు ఏ.నరేందర్‌రెడ్డి, ఏండీ.తాజుద్దీన్, కృష్ణప్రసన్న, ఏజీపీలు వేలాద్రి, శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.