క్రైమ్/లీగల్

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తల్లీకొడుకు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 9: చిత్తూరు జిల్లా పాకాల మండలం గానుగపెంట పంచాయతీ పూనగపల్లి గ్రామంలో ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తల్లీ కొడుకులు సజీవ దహనమైన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పాకాలకు చెందిన శేఖర్ (50) సోమవారం రాత్రి పూనగపల్లి గ్రామంలో వున్న తన తల్లి శంకరమ్మ (75) వద్దకు వచ్చాడు. ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు. ఈ క్రమంలో ఆర్ధరాత్రి సమయంలో ఏమి జరిగిందో కానీ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి వారిని చుట్టుముట్టడంతో ఇంట్లోంచి వెలుపలికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ మంటల్లోనే చిక్కుకుని సజీవదహనమయ్యారు. చుట్టపక్కల వారు గమనించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అప్పటికే తల్లీకొడుకులు ఇద్దరూ మృతి చెందారు. వీరి మృతదేహాలను పీలేరు ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా శంకరమ్మ ఇంట్లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగివుండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కాగా పాకాల ఎస్ ఐ రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరంచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.