క్రైమ్/లీగల్

అనిశా వలలో డిప్యూటీ కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఓ అవినీతి అధికారి చివరకు అవినీతి అధికారులకు చిక్కారు. నెల్లూరుజిల్లాలో తెలుగుగంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మన్నం లక్ష్మీనరసింహం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ డి.శాంతో నేతృత్వంలో ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నెల్లూరులోని లక్ష్మీనరసింహం ఇంటితో పాటు కావలి, ఒంగోలు, రాజమండ్రిలోని ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల సమయంలో ఇంట్లో 650 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.18లక్షలకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు, రూ.4.50లక్షలు నగదు, మరో రూ.2లక్షలు బ్యాంక్ ఖాతాలో నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఆయన కుమారుడి పేరు మీద కావలిలో ఓ బహుళ అంతస్తుల దుకాణ సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భవనం విలువ రూ.3కోట్లుగా
అధికారులు నిర్ధారించారు. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అయిదు చోట్ల వ్యవసాయ భూమి, 3 ప్లాట్లు, నెల్లూరులో మూడంతస్తుల భవంతి, ఓ కారు, మోటార్‌సైకిల్ ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ ఆస్తుల విలువ రూ.4,14,30,000గా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ రూ.15కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక సాధారణ విడిఓగా 1989లో విధుల్లో చేరిన లక్ష్మీనరసింహం కోట్లకు పడగలెత్తారు. ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారనే విషయం తెలుగుగంగ కార్యాలయంతో పాటు ఇతర శాఖల్లోనూ సంచలనం రేపింది.