క్రైమ్/లీగల్

డ్రగ్స్ మాఫియాపై టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 12: నగరంలో డ్రగ్స్ మూలాలను పోలీసు లు గుర్తించారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా చాపకింద నీరులా కొనసాగుతున్న మాదక ద్రవ్యాల ము ఠా గుట్టు రట్టయింది. ఈముఠాకు చెం దిన ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసు లు తమ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వీరి నుంచి 14గ్రాముల మెధలైన్ డయాక్సీ మెధాంఫేటమిన్, 2.5 కేజీల గంజాయి, ఎనిమిది సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నా రు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన యువతీ, యువకులను, సంపన్న కుటుంబాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ ఎరగా చూపి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ అధికారులు, సిబ్బంది పెనమలూరు పోలీస్టేషన్ పరిధిలో వలపన్ని నిందితులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ హర్షవర్ధరాజు వివరాలు వెల్లడించారు. కానూరుకు చెందిన సాయిన అనంత్‌కుమార్ (26) టాంజానియా దేశానికి చెందిన ప్రస్తుతం మంగళగిరి వడ్డేశ్వరంలో ఉంటున్న యోనా లిస్వా షబానీ (25) అలియాస్ యోనా, మహ్మద్ గహేల్ రసూల్ (24) అలియాస్ కబూబ్ ( సూడాన్), కృష్ణలంక రాణిగారితోటకు చెందిన కందుల శ్రీకాంత్ (30), పోరంకి గ్రామానికి చెందిన అరవపల్లి శ్రీమారుతీ (22), పటమట కృష్ణానగర్‌కు చెందిన మనె్న హేమంత్ రాజ్ (26), తాడిగడపకు చెందిన షేక్ సంధానీ (18)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో స్థానికులైన యువకులు సదరు ఇద్దరు విదేశీయులతోపాటు కందుల శ్రీకాంత్‌ల వద్ద మెధలైన్ డయాక్సీ మెధాంఫేటమిన్‌ను గ్రాము రూ.2వేల నుంచి రూ.2,550 వరకు కొనుగోలు చేసి విజయవాడ, గుంటూరులోని వివిధ కార్పొరేట్ కళాశాలల్లోని విద్యార్థులకు, ఇతరులకు గ్రాము రూ.4వేలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, విశాఖపట్నం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఆ సరుకును విదేశీయులకు ఇచ్చి బదులుగా వారి నుంచి మెధలైన్ డయాక్సీ తీసుకోవడం ద్వారా డ్రగ్స్ మార్పిడికి పాల్పడుతున్నారు. విదేశీయులు డ్రగ్స్‌ను బెంగళూరు, హైదరాబాద్ నుంచి తెప్పించినట్లు విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా నిందితుల్లో సాయిన అనంత్‌కుమార్ 2009లో ఇంటర్ చదువుతూ మధ్యలో ఆపేసి యానిమేషన్ వర్క్ నేర్చుకుని హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి 2016లో నగరానికి వచ్చాడు. అదే సంవత్సరం పెనమలూరు పోలీస్టేషన్ పరిధిలో ఒక హత్య కేసులో అరెస్టు కాగా అతనిపై రౌడీషీటు తెరిచారు. వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపి గంజాయి సరఫరా, విక్రయాలకు పాల్పడటం వల్ల కొంతకాలం క్రితం పెనమలూరు పోలీసులు అనంత్‌కుమార్‌తోపాటు సంధానీని కూడా అరెస్టు చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీసీపీ తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఏసిపిలు వర్మ, కె సూర్యచంద్రరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.