క్రైమ్/లీగల్

ఏసీబీ కస్టడీకి మరో నలుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈఎస్‌ఐ మందుల కుంభకోణం కేసులో మరో నలుగురు నిందితులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఈఎస్‌ఐ ఆర్సీపురం ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సురేంద్రబాబు, నాచారం ఆసుపత్రి ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి, లైఫ్ కేర్ ఎండీ సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర హెల్త్‌కేర్ ఎండీ అరవింద్‌రెడ్డిలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను రెండు రోజుల పాటు అధికారులు విచారించనున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురిని బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి తరలించారు. ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో ఆరుగురిని ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం విదితమే. కస్టడీకి తీసుకున్న వారిలో దేవికారాణితో పాటు పద్మజ, ఇందిరా, రాధిక, ఫార్మా కంపెనీ ప్రతినిధులు శ్రీహరి, నాగరాజు, హర్షవర్థన్ ఉన్నారు.