క్రైమ్/లీగల్

శివస్వాముల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్న... 14 మందిపై కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ,్ఫబ్రవరి 4: దళిత కులానికి చెందిన వారు శివమాలాధారణ చేసిన వారు శివస్వాములను దేవాలయం, మహాపూజ కార్యక్రమానికి అడ్డుకున్న 14మందిపై కేసులు నమోదు చేసిన్నట్లు మరికల్ సిఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మరికల్ పోలీస్‌ష్టేషన్‌లో స్థానిక విలేకరులతో మరికల్ సిఐ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ధన్వాడ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన దళితులు శివ దీక్షను చేపట్టడం జరిగిందని గ్రామంలోని శివాలయంలో నిర్వహించిన శివమహాపూజ కార్యక్రమంలో శివస్వాములు హజరు కాకూడదని గ్రామానికి చెందిన జి.చంద్రశేఖర్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి, వెంకటయ్య, జిఎస్ వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి, సంజీవరెడ్డిలతో పాటు మరో నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. శివస్వాముల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన్నట్లు సిఐ తెలిపారు. ఈ విషయంపై సోమవారం నారాయణపేట డిఎస్పీ శ్రీ్ధర్ ధన్వాడ మండలంలోని కొండాపూర్ గ్రామానికి వస్తున్నారని నిజాలను తెలుసుకోనున్నారని తెలిపారు.