క్రైమ్/లీగల్

భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 11: మండలంలోని కోణాయిపల్లిలో భారీ చోరీ జరిగిన సంఘటన జరిగింది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొణాయిపల్లి గ్రామ వాస్తవ్యుడైన నరేందర్ సింగ్ శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటిలో దొంగలు చొరబడి భారీ చోరికి పాల్పడ్డారు. ఇంటిలోనికి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి నరేందర్‌సింగ్ నిద్రిస్తున్న గది తలుపులను బయటి నుంచి మూసివేశారు. అనంతరం ఇంటిలోని మరో గదిలో పిల్లలతో నిద్రిస్తున్న నరేందర్‌సింగ్ తల్లి తుల్జాబాయి వద్దకు చేరుకుని ఆమె మెత్తకింద దాచుకున్న తాళాలను తీసుకుని అక్కడే ఉన్న బీరువా తెరిచి అందులోని పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలను, నగదు లక్షా 32వేల రూపాయలను దోచుకుని ఉడాయించారు. ఆదివారం ఉదయం నాలుగు గంటలకు నరేందర్‌సింగ్ లేచి బయటకు రావడానికి ప్రయత్నించగా గది తలుపులు తెరచుకోలేదు. బయట నుండి గొల్లెం వేసి ఉండటంతో తెరచుకోకపోవడంతో పై అంతస్తులో ఉండే తన సోదరుడు సురేందర్‌సింగ్‌కు ఫోన్‌చేసి గది తలుపులను బయటినుంచి తీయించాడు. అనంతరం అనుమానం వచ్చి పక్క గదిలో చూడగా తన తల్లి పిల్లలు ఇద్దరు నిద్రిస్తున్నప్పటకీ బీరువా తలుపులు మాత్రం తెరిచి ఉండి అందులోని వస్తువులన్ని చిందరవందరగా చెల్లాచెదురై కనబడ్డాయి. బీరువాను పరిశీలించగా అందులోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు కనిపంచలేదు. చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించాడు. నేరవిభాగం పోలీసులు క్లూస్‌టీంను రంగంలోకి దింపారు. అన్ని వివరాలు సేకరించి బాధితుడు నరేందర్‌సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గ్యార పవన్‌కుమార్ తెలిపారు.