క్రైమ్/లీగల్

గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 10: కారులో గంజాయి ప్యాకెట్లను రవాణా చేస్తున్న ఇద్దరిని ఉప్పల్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు అరెస్టు చేసి వారి వద్ద రూ.1.32లక్షల విలువైన 22కేజీల ఎండు గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి చున్నూరుకు చెందిన నారగాని వెంకటేశ్(24), నాగరాజు(20) మరో వ్యక్తి సంతోష్‌తో కలిసి టాటా టయాగో కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. తప్పించుకున్న సంతోష్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.