క్రైమ్/లీగల్

కాలువలో పడి ఇద్దరు యువకుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, నవంబర్ 10: వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం, కడుకుంట్ల మధ్య గల భీమాకాలువలో ఆదివారం ఉదయం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైద్రాబాద్‌లో నివాసముంటున్న అంజయ్య, రామకృష్ణ సాగర్, నవీన్ అనే యువకులు శనివారం కడుకుంట్లలో జరిగే ఒక శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం తిరిగి వనపర్తికి చేరుకొని అక్కడి టిఫిన్ చేసి తిరిగి కడుకుంట్లకు వెళుతూ మార్గమధ్యంలో భీమాకాలువ వద్ద మళ్లీ టిఫిన్ చేయడానికి ఆగారు. టిఫిన్ తరువాత చేయికడుకోవడానికి వెళ్లిన అంజి కాలుజారి కాలువలో పడిపోగా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన నవీన్‌కూడా అందులో పడిపోయాడు. ఒడ్డును పట్టుకొని నవీన్ బయటకు రాగా ఈతరాని అంజయ్య కాలువలో పడి కొట్టుకుపోయాడు. విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా పెద్దగూడెం సర్పంచ్ కొండయ్య భీమా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో గ్రామస్తులు అధికారులు కాలువలో వెతకి అంజయ్యను బయటకు తీశారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు తెలిపారు. మృతుడు అంజయ్య(24) ఆటో డ్రైవర్‌గా చేస్తున్నాడు. అతని స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా తూడు కుర్తికాగా నవీన్‌ది జడ్చర్ల వద్దగల గంగారం గ్రామం, మరో యువకుడు రామకృష్ణసాగర్‌ది పెద్దమందడి అని పోలీసులు తెలిపారు. అంజయ్య తండ్రి తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

*చిత్రం...మృతి చెందిన అంజయ్య