క్రైమ్/లీగల్

ఆర్టీసీ డ్రైవర్ అత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడేరు, నవంబర్ 10: నెలరోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ డిపోకు చెందిన కే.సత్యంరెడ్డి అనే డ్రైవర్ ఆర్టీసీ డిపో పక్కనే ఉన్న సెల్‌టవర్ ఎక్కి ఉరివేసుకొని అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డిపో వద్ద బందోబస్తులో ఉన్న ఎస్సై మురళీగౌడ్ సంఘటన చూసి హుటాహుటిన అక్కడికి వెళ్లి గొంతుకు వేసుకున్న కేబుల్ వైర్‌ను తొలగించి కాపాడాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ల్లిన సత్యంరెడ్డిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాని, డ్రైవర్ ప్రాణపాయ స్థితిలో ఉన్నాడని, పరిస్థితి విషమంగానే ఉందని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ కార్మికులలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం కేసీఆర్ మొండి వైఖరిపై శాపనార్థాలు పెడుతున్నారు.