క్రైమ్/లీగల్

ఆర్‌టీఐ నుంచి.. సుప్రీం వరకూ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం(సీజేఐ) సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) పరిధిలోకి వస్తుందని రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. ఈ కేసు 2007 పది నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టులో సాగింది. మొత్తానికి బుధవారం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ తీర్పును వెలువరించింది. కేసు విచారణ సాగిందిలా...
* 2007 నవంబర్ 11: ఆర్‌టీఐ కార్యకర్త సీ అగర్వాల్ తొలిసారి పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు.
* నవంబర్ 30: అగర్వాల్‌కు సమాచారం ఇవ్వడానికి నిరాకరణ.
* డిసెంబర్ 8: తనకు సమాచారం ఇవ్వడానికి నిరాకరించారంటూ సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో సవాల్
* 2008 జనవరి 12: అగర్వాల్ దరఖాస్తును సుప్రీం కోర్టు రిజిస్ట్రీ తోసిపుచ్చింది.
* మే 5: ఆర్‌టీఐ కార్యకర్త అగర్వాల్ కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)ని ఆశ్రయించారు.
* 2009 జనవరి 6: న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు వెల్లడి చేయాల్సిందేనని సుప్రీంను ఆశ్రయించిన సీఐసీ. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్‌టీఐ చట్టం కిందే వస్తుందని వెల్లడి
* జనవరి 19: సీఐసీ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన సీఐజే ఆఫీసు.
* జనవరి 19: సీఐసీ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే మంజూరు. న్యాయకోవిధుడు ఎస్ నారిమన్‌ను సహాయకునిగా కోర్టు నియామకం. న్యాయపరమైన సలహాలు ఇవ్వాలని ఆదేశం.
* ఫిబ్రవరి 26: ప్రధాన న్యాయమూర్తి నుంచి న్యాయమూర్తి వరకూ ఆస్తులకు సంబంధించి వివరాలు వెల్లడించనక్కర్లేదని సుప్రీం వాదన. అవి వ్యక్తిగత సమాచారం కిందకు వస్తాయని, ఆర్‌టీఐ చట్టం వర్తించదని వెల్లడి
* మే 17: ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు సుప్రీం న్యాయమూర్తుల విముఖత. పార్లమెంట్‌లో చట్టం చేయాలని, అది కూడా దుర్వినియోగం కాకుండా చూడాలని పేర్కొన్నారు.
* మార్చి 24: న్యాయమూర్తులను రాజకీయ నాయకుల్లా చూడకూడదని, ఆస్తులు వివరాలు అడగకూడదని హైకోర్టు వ్యాఖ్య
* మే 1: న్యాయమూర్తుల ఆస్తులు వెల్లడించాలన్న పిటిషషన్‌కు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ‘ఇంప్లీడ్’ అయింది. న్యాయమూర్తులు స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలు బహిర్గం చేయాలని కోరింది.
* మే 4: పారదర్శకత మరీ ఎక్కువైతే న్యాయ స్వేచ్చకు భంగకరమని సుప్రీం కోర్టు వ్యాఖ్య
* సెప్టెంబర్ 2: న్యాయమూర్తులకు ఆర్‌టీఐ చట్టం వర్తిస్తుందన్న సీఐసీ వాదనను సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్. పారదర్శకత తప్పదని వ్యాఖ్య
* అక్టోబర్ 5: హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన సుప్రీం.
* అక్టోబర్ 6: సుప్రీం కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకారం. అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం.
* అక్టోబర్ 7: పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కేసు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు. ముగ్గురు న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం.
* నవంబర్ 12: ఆస్తుల వివరాలు బహిర్గం చేయాలని సుప్రీం న్యాయమూర్తులు తీర్మానం. ప్రధాన న్యాయమూర్తికే వివరాలు ఇవ్వాలని నిర్ణయం. హైకోర్టు పరిశీలన.
* నవంబర్ 13: వాదోపవాదాలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
* 2010 జనవరి 12: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆఫీసూ ఆర్‌టీఐ చట్టం పరిధిలోకే వస్తుందని హైకోర్టు సంచలన తీర్పు
* నవంబర్ 26: హైకోర్టు, సీఐసీ ఆదేశాలు సుప్రీంలో సవాల్. సుప్రీం కోర్టు సెక్రెటరీ జనరల్, సీపీఓ మూడు పిటిషన్లు దాఖలు.
* 2016 ఆగస్టు 17: దీనిపై ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.
* 2019 ఏప్రిల్ 4: విచారణ పూర్తిచేసిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంచింది.
* నవంబర్ 13: 2010లో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీం ధర్మాసనం సమర్ధన. సీజేఐ ఆఫీసు ఆర్‌టీఐ చట్ట పరిధిలోకి వస్తుందని తీర్పు.