క్రైమ్/లీగల్

హీరో రాజశేఖర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, నవంబర్ 13: ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ మరోసారి రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ వద్దనున్న ఔటర్ రింగురోడ్డుపై ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కథన ప్రకారం.. రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొట్టిన్నట్లు తెలిపారు. కారు పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయినట్లు తెలిపారు. ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. మూడేళ్ల క్రితం పీవీఎన్‌ఆర్ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి రాజశేఖర్ బయటపడ్డారు. తన కారుతో మరొకరి వాహనాన్ని ఢీకొట్టారు. కాగా, బాధితుడు రాంరెడ్డితో వివాదం పరిష్కరించుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేయకపోవడం తెలిసిందే.

*చిత్రాలు.. స్వల్పగాయాలతో రాజశేఖర్.. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు