క్రైమ్/లీగల్

చిన్నారిపై తాత అఘాయత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండవల్లి, నవంబర్ 13: మూడేళ్ల మనువరాలిపై స్వయాన తాతే అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఈ ఘటన కృష్ణాజిల్లా మండల కేంద్రమైన మండవల్లి సమీప గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. గ్రామానికి చెందిన ఒక చేపల చెరువుకు కాపలాగా ఉన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరికి తోడుగా తాత (60) కూడా వారితో ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం భార్యా భర్తలిద్దరూ చిన్న పాపను ఇంటో ఉంచి కైకలూరు వెళ్లారు. రాత్రి వారు తిరిగి ఇంటికి వచ్చే సరికి చిన్న పాప ఆపస్మారక స్థితిలో ఉంది. దీంతో వారు ఆ పాపను కైకలూరులో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుడు పాప అత్యాచారానికి గురైనట్టు గుర్తించారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముద్దులలొలకే ఆ పసి పాపపై సొంత తాతే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ సత్యానందం, కైకలూరు సీఐ జయకుమార్, ఎస్‌ఐ విజయకుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.