క్రైమ్/లీగల్

సాంబారు పాత్రలో పడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణ్యం, నవంబర్ 13: యూకేజీ విద్యార్థి ఒకరు ప్రమాదవశాత్తు వేడివేడి సాంబారు పాత్రలో పడి మృతి చెందాడు. కర్నూలు జిల్లా పాణ్యంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యాంసుందర్‌రెడ్డి కుమారుడు పురుషోత్తంరెడ్డి(7) పాణ్యంలోని విజయ నికేతన్ ప్రైవేటు రెసిడెన్సియల్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలు తోసుకోవడంతో పురుషోత్తంరెడ్డి ప్రమాదవశాత్తు వేడివేడి సాంబారు పాత్రలో పడ్డాడు. దీంతో ఒళ్లంతా కాలింది. వెంటనే బాలుడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పురుషోత్తంరెడ్డి మృతి చెందాడు. రెండు నెలల క్రితమే చిన్నారి తల్లి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఎస్‌ఐ రాకేష్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*చిత్రం... పురుషోత్తంరెడ్డి