క్రైమ్/లీగల్

ఉప్పులూరులో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, నవంబర్ 17: గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీ చేసిన సంఘటన ఉప్పులూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం ఈనెల 14న కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి షిర్డీ వెళ్లి తిరిగి ఆదివారం ఉదయం వచ్చారు. ఇంటికెళ్లేసరికి తాళం పగలకొట్టి ఉంది. ఇంట్లో వస్తువులు, బీరువలోని దుస్తులు చెల్లాచెదురుగా పడిఉండటం గమనించి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు రూ.60వేలు విలువ చేసే బంగారం, వెండి, నగదు పోయిందని తెలిపారు. బాధితుడు సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహ్మద్ షరీఫ్ తెలిపారు.