క్రైమ్/లీగల్

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం (రామప్ప), నవంబర్ 18: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 110 కేజీల గంజాయి, ఒక పిస్తోల్, రెండు నకిలీ బంగారు కడ్డీలు, నాలుగు నకిలీ వజ్రాలు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక కారుతో పాటు రూ.లక్ష 10వేల నగదును సీజ్ చేసినట్లు ములుగు ఏఎస్పీ తెలిపారు. సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. సోమవారం తెల్లవారు జామున గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో వెంకటాపూర్ నుంచి పాలంపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో సబ్‌స్టేషన్ దగ్గరలో ఉన్న కోళ్లఫాంలో ఉదయం 9 గంటలకు తనిఖీలు నిర్వహించారు. ఏపీ 29 ఏడబ్ల్యూ 5872 నంబరు గల కారులో గంజాయితో పాటు అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ములుగు గడిగడ్డకు చెందిన ఇబ్రహీంబాబా మహమ్మద్ అలియాస్ అమీర్‌ఖాన్, అలియాస్ చాంద్‌పాషా, అలియాస్ అన్నసతీష్ అనే ముస్లిం వ్యాపారి, ఖమ్మం జిల్లాకు చెందిన కోళ్లఫాం గుమస్తా దట్టగాని వీరన్న, ములుగుకు చెందిన నక్క రవిచందర్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి తిరుపతి పరారీలో ఉన్నారు. వీరంతా ప్రజల నుంచి డబ్బులు తీసుకొని తక్కువ ధరకు కిలోల రూపంలో బంగారం, వజ్రాలు ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారని తెలిపారు. గంజాయి రవాణా ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై భూక్య నరహరి, పోలీసు సిబ్బంది సీహెచ్ ఉదయ్‌భాస్కర్, ఎస్.రాజ్‌కుమార్, ఎం.యాకేష్, వి.రమేష్‌లను ప్రత్యేకంగా ఏఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ములుగు సీఐ దేవేందర్‌రెడ్డి, ఆర్‌ఐ స్వామి ఉన్నారు.

*చిత్రం... కేసు వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ సాయిచైతన్య