క్రైమ్/లీగల్

చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, డిసెంబర్ 10: 8 ఏళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఎస్ ఐ సతీష్ తెలిపారు.
ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అప్పరాల తాండాలోని 8 ఏళ్ల చిన్నారి సోమవారం రాత్రి బహీర్‌భూమికి వెళ్తున్నానని తన తాతతో చెప్పగా సమీపంలోగల చక్కెర ఫ్యాక్టరీలో పని చేస్తున్న కర్నూల్ జిల్లాకు చెందిన మస్తాన్‌వలీ(50) చిన్నారిని ముళ్లపొదల్లోకి తీసుకవెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో బంధువులు గమనించి అక్కడికి చేరుకొని మస్తాన్‌వలీకి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు సేకరించి మస్తాన్‌వలీని అదుపులోకి తీసుకొని విచారించారు. మస్తాన్‌వలీపై ఫోక్స్ యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.