క్రైమ్/లీగల్

ప్రైవేట్ బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, ఏప్రిల్ 20: హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామశివారులో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన ప్రమాదంలో 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుండి వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఆర్టీసీ ప్రైవేట్ బస్సు రాత్రి 10 గంటల ప్రాంతంలో 48 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈబస్సు తెల్లవారుజామన 3.30 గంటల సమయంలో మండలపరిధిలోని అయిటిపాముల గ్రామశివారు ప్రాంతానికి చేరుకొగా డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా బస్సును నడుపుతూ నిద్రలోకి జారుకోవడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన రైలింగ్‌ను ఢీకొట్టి 20 అడుగుల లోతులో గల కాలువలో పడిపోయింది. ఈప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో దుర్గాపావని, శ్రీనివాస్, గోపి, ధర్మరాజు, అప్పారావు, పుష్పలతలతో పాటు మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన వారిని రెండు అంబులెన్సులలో చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.రంజిత్ తెలిపారు.

చిత్రం..అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ బస్సు