క్రైమ్/లీగల్

భక్తులను మోసం చేస్తున్న ఆలయ ఉద్యోగిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, డిసెంబర్ 10: శ్రీకాళహస్తీశ్వరాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణ భక్తులను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక విచారణ జరిపి ఆయనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈ ఓ తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాదాయశాఖ ఆదేశాల మేరకు దేవస్థానానికి సంబంధించిన నకిలి వెబ్‌సైట్‌లపై దృష్టిసారించామని అన్నారు. ఇందులో సూర్యనారాయణ మోసాలు ఈ సందర్భంగా బయటపడ్డాయని చెప్పారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి భక్తులు ఇచ్చిన ఫోన్ నెంబర్లు ద్వారా సూర్యనారాయణ పూజలు చేయిస్తామంటూ డబ్బులు తన ఖాతాలో జమ చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. రూ. 80వేలు వరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆయన ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో అతనిని సస్పెండ్ చేసి, పోలీసు కేసు నమోదు చేశామన్నారు.