క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాపురం, డిసెంబర్ 11: కడప జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. రామాపురం మండలం కొండవాండ్లపల్లె సమీపంలో కారును లారీ ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాయచోటికి చెందిన హరూన్‌బాషా(30), ఆసిఫ్‌బాషా(28), అజీరాబేగం(45), డ్రైవర్ అర్షన్‌ఖాన్(31) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రాయచోటికి చెందిన ఖాదర్‌మోదన్ అమెరికా నుంచి ప్రొద్దుటూరుకు వచ్చిన చిన్నకూతురు, అల్లుడిని చూసేందుకు 11 మంది కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు.