క్రైమ్/లీగల్

మీ ఇంట్లో ఎవరైనా రేప్‌కు గురయ్యారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఓ అత్యాచార ఘటనపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు ఓ న్యాయవాదిని ఉద్దేశించి ‘మీ బంధువులు ఎవరైనా అత్యాచారానికి గురయ్యారా?’ అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించింది. అత్యాచారాల కేసుల్లో పలుకుబడిన ఉన్న వ్యక్తులు, మంత్రులు లేదా ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం లేదని ఎంఎల్ శర్మ అనే న్యాయవాది కోర్టులో పిల్ వేశారు. శుక్రవారం పిల్‌ను విచారణకు చేపట్టిన జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ లావునాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం కిందకు ఎలా వస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులను పట్టుకొచ్చి పిల్ ఎలా వేస్తారు.. ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసుకు దీనికి ఏమిటి సంబంధం అంటూ బెంచ్ ప్రశ్నలు కురిపించింది. అంతటితో ఆగకుండా ‘ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఈపాటికే ఆదేశాలు జారీచేసింది. ‘మిస్టర్ శర్మా.. ఈ కేసులో నీవు బాధిత వ్యక్తివి కావు. అలాగే క్రిమినల్ కేసు పిల్ అవదు’ అని మండిపడింది. చాలా అత్యాచారాల కేసుల్లో మాజీ మంత్రులు లేదా ఎమ్మెల్యేలు నిందితులుగా ఉంటున్నా వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదని పిటిషనర్ ఆరోపించారు. నిందితుల పలుకుబడి చూసి పోలీసులు కేసు పెట్టడం లేదన్న పిటిషనర్ వాదనపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘అత్యాచారాల గురించి మాట్లాడేందుకు మీరెవరు? అన్నింటినీ జనరలైజ్ చేసేయడమేనా? మీ బంధువులు ఎవరైనా అత్యాచార బాధితులా? ఎవరైనా రేప్‌కు గురయ్యారా?’ అంటూ న్యాయమూర్తి బాబ్డే పిటిషనర్‌ను నిలదీశారు. బెంచ్ వ్యాఖ్యలతో కోర్టు హాల్‌లో నిశ్శబ్దం నెలకొంది. న్యాయవాదులందరూ వౌనం వహించారు. అయినప్పటికీ న్యాయవాది తన వాదనను కొనసాగిస్తునే ఉండగానే కేసును కొట్టివేస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది. బీజేపీ ఎమ్మెల్యే కుల్‌భూషణ్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని సుప్రీం కోర్టు ఇంతకు ముందే ఆదేశించిన సంగతి తెలిసిందే.