క్రైమ్/లీగల్

భార్య చేతిలో భర్త హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్: కట్టుకున్న భార్య చేతిలోనే భర్త రాయపురం ధర్మయ్య (55) అతి దారుణంగా హత్యకు గురైన సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... హత్యకు సంబందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మృతుడు ధర్మయ్యకు ఇద్దరు భార్యలు శాంతమ్మ, వెంకటలక్ష్మిలు ఉన్నారు. గత 25సంవత్సరాల క్రితం మొదటి భార్య శాంతమ్మను వదిలి స్థానిక రైల్వే కాలనీలో రెండవ భార్య వెంకటలక్ష్మితో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలి కాలంగా ధర్మయ్య కూతురి కుటుంబంలో గొడవలు జరుగుతుండగా ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. పంచాయతీ వాయిదా వేసిన అనంతరం ధర్మయ్య పెద్దమనుషులతో పాటు మద్యాన్ని తాగాడు. మద్యం మత్తులో ఉన్న ధర్మయ్య మరొక మద్యం సీసాను కొనుగోలు చేసి శివునిపల్లిలోని మొదటి భార్య శాంతమ్మ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య వివాదం చెలరేగడంతో కోపోద్రిక్తురాలైన శాంతమ్మ ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో భర్త తలపై గట్టిగా కొట్టడంతో ధర్మయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా, సంఘటన సమాచారాన్ని అందుకున్న జనగామ డీసీపీ మల్లారెడ్డి ఘన్‌పూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌బాబు, సీఐ నరేందర్‌లు హత్య జరిగిన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ధర్మయ్య రెండవ భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని హత్యకు సంబందించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు డీసీపీ తెలిపారు.