క్రైమ్/లీగల్

17 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఏప్రిల్ 26: ఐపిఎల్ మ్యాచ్‌లను క్రికెట్ బెట్టింగ్‌లుగా మార్చుకుని వేర్వేరు ప్రాంతాలలో బెట్టింగ్ జూదాలు ఆడుతున్న 17మంది బెట్టింగ్ రాయుళ్లను గురువారం అరెస్టుచేసినట్లు మదనపల్లె డిఎస్‌పి చిదానందరెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 19 సెల్‌ఫోన్‌లు, రూ.78,380 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గురువారం మదనపల్లె వన్‌టౌన్ సర్కిల్ కార్యాలయంలోఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. గురువారం ఉదయం సమాచారంతో నీరుగట్టువారిపల్లె చంద్రాఆటోగ్యారేజ్ ఎదురుగా ఖాళీప్రదేశంలో ఐపిఎల్ క్రికెట్‌బెట్టింగ్‌లకు పాల్పడుతున్న గ్రూపుపై వన్‌టౌన్ సిఐ నిరంజన్‌కుమార్ తన బృందంతో దాడులు నిర్వహించి క్రికెట్‌బెట్టింగ్ ఆడుతున్న బానావాత్ రవినాయక్(36), కరమల వెంకట్రరమణ(35), నాగిశెట్టి చంద్రమోహన్(37), టివి మెకానిక్ రంగని దివాకర్(32), రంబే దామోధర్(34), జనే్న గంగులప్ప(27), రేగంటి భానుప్రకాష్(29)లను అరెస్టుచేసి వారి వద్ద నుంచి 7సెల్‌ఫోన్‌లు, రూ.21వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పి వెల్లడించారు. మదనపల్లె రూరల్ ట్రైనీ ఎఎస్‌పి సతీష్ తన బృందంతో కోళ్ళబైలు, బాబుకాలనీ తదితర ప్రాంతాల్లో చికెన్‌సెంటర్లు, హోటళ్ళు, టికొట్లు, ఆటోస్టాండ్‌లను అడ్డాగా మార్చుకుని క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న చికెన్‌సెంటర్ రామ్మోహన్, రెడ్డివినోద్, జయప్రకాష్, హరీష్, వెంకటేష్, విజయకుమార్, చాంద్‌బాష, ఎస్‌కె మహబూబ్‌బాష, బాలమురళీ, శశిభూషన్‌లను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రూ.56,380ల నగదు, 12సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరందని రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్‌పి చిదానందరెడ్డి తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్స్‌పై పోలీస్ నిఘా - డిఎస్‌పి:- మదనపల్లె పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్స్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు డిఎస్‌పి చిదానందరెడ్డి తెలిపారు. ఇదివరకే పోలీస్ హెచ్చరికలు, ప్రచారం, కరపత్రాల ద్వారా తెలిపామన్నారు. ఆటో, కారుస్టాండ్లు, లాడ్జీలు, బార్ అండ్ రెస్టారెంట్‌లు, హోటళ్ళు, దుకాణాలలో ఐపిఎల్ మ్యాచ్ ప్రత్యక్షంగా ప్రచారం చేయరాదని ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో నోటీసులు ఇచ్చామన్నారు. ఐపిఎల్ అంతా మోసమని, విద్యార్థులు, యువత, వ్యక్తులు నష్టపోతూ. డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని అరెస్టుచేసిన నిర్వహకులకు గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగిందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, బెట్టింగ్‌లను ఉపేక్షించేది లేదని డిఎస్‌పి చిదానందరెడ్డి హెచ్చరికలు చేశారు. ఈవిలేఖరుల సమావేశంలో ట్రైనీ ఎఎస్‌పి సతీష్, సిఐ నిరంజన్‌కుమార్, ఎస్‌ఐ సునీల్‌కుమార్, ఎస్‌ఐ సుమన్ తదితరులు ఉన్నారు.