క్రైమ్/లీగల్

ఇంట్లో నిల్వవుంచిన 6కిలోల ఎండు గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 4: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు అతని ఇంట్లో నిల్వవుంచిన 6కిలోల గంజాయినీ ఆదివారం ఎక్సైజ్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ ఆదేశానుసారం, పక్కా సమాచారం మేరకు దాడి చేసి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి మండలం చీలపల్లి గ్రామానికి చెందిన కలీల్ గత కొంతకాలంగా ఇంట్లోనే అక్రమంగా గంజాయినీ విక్రయిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు ఆదివారం కలీల్ ఇంటిని సోదా చేయడంతో 6కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. గంజాయి విక్రయించిన సొమ్ము 18,150రూపాయలను స్వాదీనం చేసుకొని కలీల్‌ను అరెస్టు చేశారు. దాడి చేసిన వారిలో ఎక్సైజ్ అధికారులు మోహన్‌కుమార్, రమేష్‌రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు రాజేష్, సురేష్, సుభాష్‌లు ఉన్నారు.