క్రైమ్/లీగల్

ఊర చెరువులో పడి అక్కాతమ్ముడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, ఫిబ్రవరి 13: ఆడుకునేందుకు వెళ్లిన అభం శుభం తెలియని అక్కాతమ్ముడు మండలంలోని తిరుమలాయపాలెం గ్రామంలోని ఊర చెరువు మింగేసింది. ఈ దుర్ఘటనతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. గోకవరం ఏఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..తిరుమలాయపాలెంకు చెందిన షేక్ నాగూర్ సాహెబ్ గ్రామంలో చికెన్ వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, కుమారై సత్తార్‌బీబీ (4), కుమారుడు అబ్దుల్లా (3) ఉన్నారు. సోమవారం సాయంత్రం ఆడుకునేందుకు ఇంటినుండి వెళ్లిన అక్కా తమ్ముడు చీకటిపడుతున్నా ఇంటికి రాలేదు. దీనితో బంధువులతో కలిసి గ్రామంలో బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా వారి ఆచూకీ కానరాలేదు. మంగళవారం తెల్లవారుఝామున పిల్లల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలిస్తుండగా గ్రామంలోని రామరాజు చెరువులో ఈ చిన్నారుల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ప్రమాదవశాత్తు చెరువులో జారి పడిపోయి ఉండవచ్చునని చిన్నారుల తండ్రి నాగూర్ సాహెబ్ పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుజేసి, కోరుకొండ ఎస్సై ఆర్ శివాజీ దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. మంగళవారం చిన్నారుల మృతదేహాలకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.