క్రైమ్/లీగల్

లారీ ఢీకొని చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, ఫిబ్రవరి 13: మండలంలోని కురిక్యాల గ్రామంలో కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై మంగళవారం లారీ ఢీకొనడంతో రక్షిత (9) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తన తల్లి వసంతతో కలిసి పండుగ సామానుకు వెళ్లి తిరిగి రోడ్ దాటుతుండగా కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో తల, మొండెం వేర్వేరుగా పడాయి. లారీ డ్రైవర్ చిన్నారిని ఢీకొట్టి లారీతో స్పీడుగా వెళ్తుండగా స్థానికులు గంగాధర చౌరస్తాలోని యువకులకు సమాచారం అందించడంతో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పండుగపూట చిన్నారి మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొనగా చిన్నారి తల, మొండెం విడివిడిగా పడిపోవడంతో చూసిన పలువురు కంటతడిపెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.