క్రైమ్/లీగల్

దుర్గం కేంద్రంగా డ్రగ్స్ దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీ.హీరేహాల్, ఏప్రిల్ 28 : రాయదుర్గం కేంద్రంగా డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమ సంపాదన కోసం దడ పుట్టించే డ్రగ్స్ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఫలితంగా యువకులు, విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసవుతున్నారు. ముఖ్యంగా పట్టణానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ వాడకంలో అధిక మంది 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని 75 వీరాపురానికి చెందిన డ్రగ్స్ ముఠా రాయదుర్గం నడిబొడ్డున కూరగాయల మార్కెట్ సమీపంలోని ఓ లాడ్జి వద్ద వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం, సాయంత్రం డ్రగ్స్ అమ్ముతుండటంతో ఆ సమయంలో యువకులు పెద్ద ఎత్తున పొద్దుపోయే వరకూ గుమికూడడం గమనించిన స్థానికులు వారించినట్లు సమాచారం. అధిక రద్దీ, కుటుంబాలు ఉన్న ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్నారంటే ఇందులో పెద్దల హస్తం ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాయదుర్గానికి పరిమితమైన ఈ మత్తు గ్రామాలకు విస్తరిస్తే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆదోళన వ్యక్తం చేస్తున్నారు. మత్తుకు బానిసైన విద్యార్థులు పూర్తిగా ఆరోగ్యం చెడిపోయిన తర్వాతే తెలుసుకుంటున్నామని కొందరు తల్లిదండ్రులు వాపోతున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్‌కు ఎక్కువగా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఉద్యోగుల పిల్లలు బానిసలు అయినట్లు సమాచారం. రాయదుర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీకళాశాల, బాలికల జూనియర్ కళాశాలకు డీ.హీరేహాల్, గుమ్మఘట్ట, కణేకల్లు, రాయదుర్గం విద్యార్థులు వస్తుంటారు. ఇప్పటికే గ్రామాలను పట్టిపీడిస్తున్న సారా, చీఫ్‌లిక్కర్, మట్కా వంటి వాటికి డ్రగ్స్ తోడైతే ఇక ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తలచుకుంటే గుండె గుబేలవుతోంది. కోరలు చాచిన మత్తు నుంచి యువతను కాపాడాల్సిన బాధ్యత అధికారులు గుర్తెరిగి డ్రగ్స్ ముఠాను అరికట్టి రాయదుర్గం ప్రశాంతను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మరోవైపు తల్లిందడ్రులు సైతం తమ పిల్లల కదలికలు తెలుసుకుని ఎప్పటిప్పుడు ఆధీనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.