క్రైమ్/లీగల్

నిండు జీవితాన్ని బలిగొన్న ఇష్టం లేని పెళ్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఫిబ్రవరి 13: ఇష్టం లేని వివాహం నిండు జీవితాన్ని బలితీసుకుంది. కాళ్ల పారాణి ఆరక ముందే నూతన వధువు జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. మూడుముళ్ల బంధం మూడు నిద్రలతోనే తెగిపోయింది. నూతన వరుడు ప్రకాశం బ్యారేజీ మీద నుండి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటివరకూ రెండు కుటుంబాల్లో పండుగ వాతావరణం కాస్తా మహాశివరాత్రి నాడే విషాదంలోకి నెట్టింది. ఈ సంఘటన వివరాలు వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం కంకిపాడు సమీపంలోని గొల్లగూడెంకి చెందిన శ్రీనివాసరావు (37) విజయవాడలో చార్టెడ్ ఎకౌంటెంట్‌గా జీవనం సాగిస్తున్నాడు. వయస్సు పెరుగుతుందని కుటుంబ సభ్యులు వివాహం చేసుకోవాలని వత్తిడి తెచ్చారు. వారి మాట కాదనలేని శ్రీనివాసరావు వివాహం ఈనెల 8న ఘనంగా జరిగింది. వివాహం అనంతరం మూడు నిద్రలు తంతు ముగిసింది. ఇరు కుటుంబాల్లో ఎంతో పండుగ వాతావరణం నెలకొంది. కాగా మంగళవారం మహాశివరాత్రి కావడంతో శ్రీనివాసరావు అత్తారింట్లో కొత్త అల్లునికి సకల మర్యాదలకు, విందులకు వధువు బంధువులు సిద్ధమయ్యారు. పనుందని ఇంటి నుండి బయటకు వచ్చిన శ్రీనివాసరావు ప్రకాశం బ్యారేజీపై 57వ ఖానా వద్ద నదిలో దూకేశాడు. అక్కడే విధుల్లో ఉన్న ఎలక్ట్రీషియన్ రామలింగేశ్వరరావు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు శ్రీనివాసరావుని ప్రాణాలతో బయటపడేయాలని విఫలయత్నం చేశారు. అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని వద్ద లభించిన ఆధారాల ప్రకారం విచారించగా ఇష్టం లేని పెళ్లి కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. సీఐ డి.కాశీవిశ్వనాధ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ కృష్ణవర్మ కేసును దర్యాప్తు చేస్తున్నారు.