క్రైమ్/లీగల్

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 13: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందగా కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి జోడిమెట్ల సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైద్రాబాద్-వరంగల్ జాతీయ రహదారి జోడిమెట్ల సమీపంలో నగరం నుండి పోచారం ఇన్ఫోసిస్ కంపెనీకి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎన్.కృష్ణచైతన్య (27)ను ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వైపు వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను దాటి ఢీకొట్టినట్లు చెప్పారు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై వస్తున్న కృష్ణచైతన్యను ఎదురుగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనలో కారు డ్రైవర్ సాయికృష్ణ (21)కు తీవ్ర గాయాలు కాగా నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కారు డ్రైవర్ అతి వేగంగా అజాగ్రత్తగా నడపటం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు నగరంలోని పద్మారావునగర్‌లో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ పి.రఘువీర్‌రెడ్డి తెలిపారు.