క్రైమ్/లీగల్

క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఏప్రిల్ 30 : ఆదోని డివిజన్‌లోని పెద్దహరివాణం గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 5,31,490 స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. పెద్దహరివాణంలో రంగస్వామి, దేవేంద్రప్ప, కురువ లింగన్న, ఇండ్లపై దాడి చేసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 5,31,490, 6 సెల్‌పోన్లు కూడా వారి వద్ద నుండి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే ఆదోనికి చెందిన ఇస్మాయిల్, ఆంజి, కర్నాటకకు చెందిన పీర్‌బాషా, పెద్దహరివాణంకు చెందిన నల్లారెడ్డి, గర్జప్పలు కూడా క్రికెట్ బెట్టింగ్‌కు సహకరిస్తున్నట్లు తమ విచారణ తెలిసిందని వీరిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.