క్రైమ్/లీగల్

ఇందూ టెక్‌జోన్ కేసులో వైఎస్ జగన్‌కు సమన్లు జారీ చేసిన సిబిఐ కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూ టెక్ జోన్ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకుని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభసభ్యుడు విజయ్ సాయిరెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యకు కూడా సమన్లను జారీ చేశారు. మార్చి 16వ తేదీన కోర్టుకుహాజరు కావాలని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులను మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 కింద శిక్షించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టును అభ్యర్థించింది.