క్రైమ్/లీగల్

ఎస్.ఎఫ్.ఐ. నాయకులపై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మే 1: పోలీసులు ఎస్.ఎఫ్.ఐ. నాయకులపై బనాయించిన కేసును స్థానిక ప్రధమ శ్రేణి ఎగ్జిక్యూటివ్ మండల మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం కొట్టివేసింది. 2016వ సంవత్సరం అక్టోబర్ నెలలో విశాఖపట్నం క్రిష్ణ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న బి.రాజ్‌కుమార్ ప్రాణాంతక వ్యాధికి గురై మృతి చెందాడు. గిరిజన విద్యార్థికి సకాలంలో వైద్య సేవలు అందించకపోవడంతో మృతి చెందాడని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్టు ఎస్.ఎఫ్.ఐ. నాయకులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంభానికి నష్టపరిహారం చెల్లించాలని అరకులోయ పట్టణంలో వారు ప్రధాన రహదారిని నిర్భందించి శవ యాత్ర చేపట్టారు. ఈ సంఘటనతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రజా శాంతికి విఘాతం కలిగిందని పోలీసులు వారిపై కేసు నమోదు చేసారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇందులో నిందితులుగా ఉన్న వి.వి.జయ, కె.్భను, పి.రామన్న, జి.చందు, వి.నర్సయ్య, సురేష్‌కుమార్, బంగారమ్మలపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. తప్పుడు కేసు నుంచి విముక్తి పొందిన ఉద్యమకారులు కేసు కొట్టివేయడంతో సంబరాలు జరుపుకున్నారు.