క్రైమ్/లీగల్

జీవో 111పై మార్చి నెలలో తుథి విచారణ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ సమీపంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి 10 కి.మీ పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో 111పై వచ్చే నెలలో పూర్తి స్థాయి విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. జీవో 111ను రాష్ట్రప్రభుత్వం సరిగా అమలు చేయడంలేదంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ టి అమర్‌నాథ్‌గౌడ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. హెచ్‌ఎండిఏ తరఫున న్యాయవాది వై రామారావు వాదనలు వినిపిస్తూ, జీవో 111 అమలుపై శాస్ర్తియ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని నియమించామని కోర్టుకు తెలిపారు. ఈ కమిటీ నివేదిక అందాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంపై వాదనలువినిపించేందుకు అడ్వకేట్ జనరల్‌కు సమయం ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.