క్రైమ్/లీగల్

బరితెగించిన ఇసుక మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 1: అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు రుచిమరిగిన ఇసుక మాఫియా బరితెగిస్తోంది. తమ అక్రమ దందాకు అడ్డుగా నిలుస్తున్న అధికారులపై భౌతిక దాడులకు సైతం వెనుకాడడం లేదు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుంకిని శివారులో మంజీరా నది సాక్షిగా మంగళవారం చోటుచేసుకున్న సంఘటన ఇసుక స్మగ్లర్ల బరితెగింపు ధోరణికి అద్దం పట్టింది. అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల మధ్య నుండి మంజీరా నది ప్రవహిస్తుండగా, మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా యంత్రాంగం ఇసుక క్వారీలకు అధికారికంగా టెండర్లు నిర్వహిస్తూ అనుమతులు మంజూరు చేస్తోంది. అయితే మహారాష్ట్ర నుండి అనుమతులు పొందుతున్న గుత్తేదార్లు సరిహద్దులను చెరిపేస్తూ తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువచ్చి మరీ లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను కొల్లగొడుతున్నారు. మహారాష్టల్రోని శేకాపూర్ క్వారీని దక్కించుకున్న కాంట్రాక్టర్లు, ఎప్పటిలాగే మంగళవారం సైతం తెలంగాణ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి కోటగిరి మండలం సుంకిని శివారులో మంజీరా నది నుండి ఇసుకను అక్రమంగా తరలించడం మొదలుపెట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, కోటగిరి ఇన్‌చార్జి తహశీల్దార్ విఠల్, ఇతర సిబ్బందితో కలిసి హుటాహుటిన సుంకిని శివారు ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే నాలుగు జేసీబీలు, పెద్ద సంఖ్యలో డోజర్లను ఉపయోగిస్తూ ఇసుకను చేరవేస్తుండడాన్ని అధికారులు గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇసుక స్మగ్లర్లు క్వారీ వద్ద పని చేస్తున్న కూలీలను రెచ్చగొట్టి అధికారులపై తిరుగుబాటు చేయాల్సిందిగా పురమాయించినట్టు తెలుస్తోంది. తాము రెవెన్యూ అధికారులమని, తమ వెంట బోధన్ సబ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి ఉన్నారని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా రాళ్లతో దాడికి దిగడంతో సబ్ కలెక్టర్, ఇతర అధికారులు చేసేదేమీ లేక వెనుదిగిరి వచ్చారు. సీజ్ చేసిన నాలుగు జేసీబీలు, డోజర్లను అక్కడే వదిలేసి కోటగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు కోటగిరి, బీర్కూర్, బోధన్ రూరల్ తదితర ఠాణాల నుండి పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందితో కలిసి సుంకిని శివారులోని మంజీరా నదీ తీరానికి వెళ్లగా, అప్పటికే ఇసుక స్మగ్లర్లు, కూలీలు అక్కడి నుండి జేసీబీలు, ఇతర యంత్రాలతో సహా ఉడాయించారని తెలిసింది. ఈ సంఘటనతో రెవెన్యూ వర్గాల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇసుక స్మగ్లర్లు అక్రమాలకు పాల్పడుతూ, అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై దాడులకు తెగబడుతుండడం వారి తెంపరితనానికి పరాకాష్టగా నిలిచింది.