క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి కడుపులోకి చొచ్చుకెళ్లిన ఇనుప చువ్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచ్చన్నపేట, మే 14: రోడ్డు ప్రమాదంలో ఓ యువకునికి కడుపులో ఇనుప చువ్వలు దిగి ప్రాణాపాయ స్థితిలోకి చేరిన సంఘటన సోమవారం జనగామ జిల్లా పోచన్నపేట శివారు గ్రామం కాశీనగర్ దాటిన తరువాత ఆలేరు సరిహద్దున జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీకి చెందిన గోపాల్‌దాస్ సుమన్ ఆదివారం పోచన్నపేటలో జరిగిన దుర్గామాత తిరుగువారం ఉత్సవాలకు స్నేహితుల ఇంటికి వచ్చాడు. తిరిగి ఆదివారం రాత్రి తన ద్విచక్రవాహనంపై బోడుప్పల్‌కు తిరుగు ప్రయాణమై వెళ్లాడు. చీకల్లో వెళ్తూ.. కాశీనగర్ దాటిన తరువాత ఆలేరు, బచ్చన్నపేట శివారులోని సరిహద్దు వద్ద మధ్య నిర్మాణంలో ఉన్న కల్వర్టుపైకి దూసుకెళ్లాడు. అడ్డంగా ఉన్న ఇనుప చువ్వల్లో వాహనంతో సహా పడిపోయా డు. ఈ సంఘటనలో సుమన్‌కు ఇనుప చువ్వలు కడుపులోంచి వీపులోకి బయటకు వెళ్లాయి. రాత్రంతా ఎవరూ గుర్తించలేదు. సోమవారం అటుగా వెళ్లే వాహన దారులు సమాచారం ఇవ్వడంతో సంబంధీకులు అక్కడివెళ్లి శరీరంలోని చువ్వలు కట్‌చేసి 108 వాహనంలో సికింద్రాబాద్‌లోని గాంధీ అసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుమన్ కోమాలో ఉన్నట్లు తెలిసింది.

చిత్రం..కడుపులో గుచ్చుకున్న చువ్వలతో సుమన్