క్రైమ్/లీగల్

గల్ఫ్ ఏజెంట్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 4: గల్ఫ్ దేశాలలో ఉపాధి కల్పిస్తామని పలువురి నుండి డబ్బులు కాజేసి మోసిగించి పరారీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్‌ను సిరిసిల్ల పట్టణంలో పోలీసులు అరెస్టు చేశారు. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మారం కరుణాకర్(36)ను ఆదివారం సిరిసిల్ల మండలం చంద్రంపేటలోని ఒక హోటల్‌లో ఉండగా, సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గత సంవత్సరం నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అమాయ ప్రజలను గల్ఫ్ దేశాలలో మంచి జీతం, కంపెనీలకు పంపిస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నట్టు తెలిపారు. ఇతడిని అరెస్టు చేసి విచారించగా ఏడు ఇండియన్ ఒరిజినల్ పాస్ పోర్టులు, నాలుగు సరస్వతి గ్రామీణ బ్యాంకు చెక్కులు, అయిదు నైన్‌సీ హంక్ కంపెనీ రశీదులు, రెండు వైద్య పరీక్షల దృవీకరణ పత్రాలు లభించాయి. ఇతడిని సిరిసిల్ల పోలీస్ స్టేషన్ తరలించి, కేసు నమోదు చేసినట్టు సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీసీఎస్ సీఐ ఆర్.బన్సీలాల్ విలేఖరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.