క్రైమ్/లీగల్

మీకేమీ పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: మణిపూర్ బూటకపుఎన్‌కౌంటర్ల కేసుల దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై రక్షణ మంత్రిత్వశాఖ తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసుల బూటకపుఎన్‌కౌంటర్లపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఏర్పాటైంది. పోలీసు ఎన్‌కౌంటర్లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరిపింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బూటకపుఎన్‌కౌంటర్లపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసులకు సంబంధించి శనివారం జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యూయూ లిలిత్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. కేసుకు సంబంధించి సీట్ ఐదు లేఖలు రాసినా రక్షణ శాఖ స్పందించకపోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగించింది. ‘సీబీఐ ప్రత్యేక దర్యాప్తు సంస్థ లేఖలు రాసినా మీకు చీమకుట్టినట్టులేదు’అని కోర్టు మండిపడింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏసీజీ) మణిందర్‌సింగ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లి సహకారం తీసుకుంటామని బెంచ్‌కు తెలిపారు. సిట్ రాసిన లేఖలకు వివరణ కోరతామని, ఈమేరకు రక్షణశాఖ సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం ఏఎస్‌జీ వ్యక్తం చేశారు. కేసులపై దర్యాప్తు జూన్ 30 నాటికి ముగించాలని జస్టిస్ లోకూర్, జస్టిస్ లలిత్ ఆదేశించారు. అలాగే స్టేటస్ రిపోర్టు నెంబర్ తమకు అందించాలని బెంచ్ చెప్పింది. కేసు తదుపరి విచారణ జూలై 2కు వాయిదా పడింది.