క్రైమ్/లీగల్

అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్ అగర్వాల్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 15: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అశోక్‌కుమార్ అగర్వాల్(57)ను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి రూ. 4 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, చందనం బొమ్మలు స్వాధీనం చేసుకున్నారు. అగర్వాల్ స్వస్థలం రాజస్తాన్ రాష్ట్రం జైపూర్ సిటీ. ఇండోనేషియాకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అలీబాయికి అగర్వాల్ ప్రధాన అనుచరుడు. అగర్వాల్ సుమారు వెయ్యి టన్నుల ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బళ్ళారికి చెందిన స్మగ్లర్ అబ్దుల్ నరుూమ్ ఇచ్చిన సమాచారం మేరకు జైపూర్ సిటీ రఘునాధపురి సర్నాదుంగర్ ప్రాంతంలో నివసిస్తున్న అగర్వాల్ కదలికలపై కడప జిల్లాకు చెందిన మూడు బృందాలు నెలరోజులుగా రెక్కీ నిర్వహించాయి. చివరకు అక్కడి జిల్లా ఎస్పీకి సమాచారం అందించి అశోక్‌కుమార్ అగర్వాల్‌ను అరెస్టుచేసినట్లు ఎస్పీ బాబూజీ తెలిపారు. అశోక్‌కుమార్‌కు చెందిన గోడౌన్ నుంచి మూడు టన్నుల బరువున్న 164 ఎర్రచందనం దుంగలు, కొయ్యతోచేసిన 44 ఏనుగుల బొమ్మలు స్వాధీనం చేసుకున్నారు.