క్రైమ్/లీగల్

ఆటోను ఢీకొన్న లారీ- ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బత్తలపల్లి, ఫిబ్రవరి 16: అనంతపురం- కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని రాగవంపల్లి బస్టాపు సమీపంలో శుక్రవారం ఆటోను లారీని ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఈదుల ముష్ఠూరు గ్రామానికి చెందిన తిక్కయ్య (37)కు ప్రభుత్వం గృహాన్ని మంజూరు చేయడంతో అందుకోసం బండలు తీసుకురావడానికి ఆటోలో బత్తలపల్లికి వచ్చి బండలు తీసుకొని స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా వెనుకబైపు నుండి వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో ఆటో రోడ్డు పక్కన పొలాల్లోకి ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో తిక్కయ్య అక్కడికక్కడే మృతిచెందగా, ఆటో డ్రైవర్ నారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ ఐ హారున్‌బాషా సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకున్నారు.