క్రైమ్/లీగల్

మదనపల్లె మున్సిపల్ ఉద్యోగి సుధాకర్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఫిబ్రవరి 16: మదనపల్లె మున్సిపల్ ఉద్యోగి సుధాకర్‌ను సస్పెండ్ చేస్తు శుక్రవారం కమీషనర్ భవానిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. తాను ఏతప్పు చేయకుండానే సస్పెన్షన్ ఎందుకు చేశారంటూ సుధాకర్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మున్సిపల్ మేనేజర్ ఫిర్యాదుతో వన్‌టౌన్ ఎస్‌ఐ సుమన్ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మున్సిపల్ మేనేజర్ రామ్‌బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలావున్నాయి... మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో మొండిబకాయిలు వసూళ్ళకు మేనేజర్, రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు, బిల్లుకలెక్టర్లు, వారి సహయకులు సైతం ప్రతిరోజు ఉదయం 6గంటలకే పన్నులు వసూళ్ళకు వెళ్తున్నారు. మున్సిపల్ ఉద్యోగి జె.సుధాకర్‌ను బిల్‌కలెక్టర్ సహాయకుడిగా నియమించారు. గురువారం నిమ్మనపల్లెక్రాస్ వద్ద ఒక ఆటోమొబైల్స్ షాపు వద్ద పన్ను వసూలుకు మున్సిపల్ మేనేజర్ రామ్‌బాబు తన సిబ్బందితో వెళ్ళారు. అప్పటికే ఆటోమొబైల్ యాజమాని వద్ద నుంచి మున్సిపల్ ఉద్యోగి జె.సుధాకర్ రూ.2500లు తీసుకున్నట్టు మేనేజరుకు ఫిర్యాదు చేశారు. రూ.2500లు మినహా మిగిలిన సొమ్ములు చెల్లిస్తామని మొబైల్ యాజమాని చెప్పడంతో మేనేజరు రామ్‌బాబు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గురువారం సాయంత్రం మున్సిపల్ మేనేజర్ రామ్‌బాబు సెల్‌కు ఫోన్‌చేసిన సుధాకర్ అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్‌ను బిల్లు కలెక్టర్ సహాయకుడి నుంచి ట్యాంక్ వాచ్‌మెన్‌గా మార్పుచేస్తు కమిషనర్ ఉత్తర్తులు జారీచేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేసి, అతనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం మున్సిపల్ మేనేజర్ రామ్‌బాబు వన్‌టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నాం 1గంటల ప్రాంతంలో కార్యాలయానికి వచ్చిన సుధాకర్ తాను ఏ తప్పు చేయలేదని, మేనేజర్ వ్యక్తిగత కక్షలతో తనపై నిందారోపణలు చేస్తున్నారని కమిషనర్ ఎదుట వాపోతూ... వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పారిశుద్యశాఖ, మున్సిపల్ డిఇలు అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ సుమన్ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.