క్రైమ్/లీగల్
తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వి.కోట, ఫిబ్రవరి 16: మండల కేంద్రమైన వి.కోటలో తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి సభ్యురాలు శుక్రవారం హత్యకు గురయ్యారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వి.కోట 1 ఎంపిటిసి సభ్యురాలుగా భాగ్యలక్ష్మి(45) వైకాపా తరపున గెలుపొందింది. ఇటీవల పార్టీ మారి తెలుగుదేశం సభ్యురాలుగా కొనసాగుతున్నారు. సత్యసాయి నగర్‌లోని సరిత ఇంటిలో నివసిస్తున్నారు. భర్త చనిపోవడంతో పిల్లలు బయట ప్రాంతాల్లో స్థిరపడడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నుండి ఇంటి తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు సోదరునికి సమాచారం అందించారు. సమాచారం పోలీసులకు తెలియడంతో అందరూ కలసి సాయంత్రం తలుపు తీసి ఇంటిలో పరిశీలించగా మరుగుదొడ్డిలో శవమై పడివుండగా గుర్తించారు. వంటిపైన గాయలు, మొఖాన్ని నీటిలో ముంచిన ఆనవాల్లు కనపడడంతో హత్యగా భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని కుప్పం సి ఐ రాఘవన్, ఎస్సై రవిప్రకాష్‌రెడ్డి, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపిడి ఒ బాలాజీ పరిశీలించారు. వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.