క్రైమ్/లీగల్
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: జిల్లాలో నిర్వహించిన దాడుల్లో రూ. 18.14 లక్షల విలువైన 124.25 టన్నుల ఎరువులను సీజ్ చేయడం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలియజేశారు. రాజమహేంద్రవరం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ ఎన్‌విఎస్ మూర్తి ఆధ్వర్యంలో జిల్లాలోని అమలాపురం, రావులపాలెం, ద్రాక్షారామలలో ఎరువుల దుకాణాలపై అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అమలాపురంలోని అనంతలక్ష్మి సీడ్స్ జనరల్ స్టోర్స్‌లో డీలర్ రైతులకు బిల్లులు ఇవ్వకపోవడం, స్టాకు రికార్డు సరిగా నిర్వహించకపోవడం, స్టాకు నిల్వల్లో తేడాలు ఉండటం వల్ల రూ.879761 విలువైన ఎరువులను సీజ్ చేసినట్టే విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలియజేశారు. అదేవిధంగా అమలాపురరంలోని గంగా సీడ్స్‌లో లోపాలు గుర్తించి రూ.26,651 విలువైన ఎరువులు సీజ్ చేశామన్నారు. రామచంద్రపురం మండలం నెలపర్తిపాడులో విజయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌లో తనిఖీలు నిర్వహించి రూ.1.34 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేసినట్టు తెలిపారు. రావులపాలెంలో అంజలి ఫెర్టిలైజర్స్‌లో రూ. 8.32 లక్షల విలువైన ఎరువులు సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు డీలర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ఈ తనిఖీలలో రూ.8.86 లక్షల విలువైన బయో మందులు కూడా పరీక్షలకు చర్యలు తీసుకున్నామన్నారు.