క్రైమ్/లీగల్

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, మే 25: విద్యుత్ షాక్‌తో మృతిచెందిన ఓ రైతు సంఘటన మండల పరిధిలోని అంకెన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ చారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని అంకెన్‌పల్లి గ్రామానికి చెందిన అంజన్న (42) అనే రైతు శుక్రవారం గడ్డంపల్లి గ్రామ శివారులోని తన పొలానికి వెళ్లి నీటి బోరు స్టార్టర్ బటన్‌ను నొక్కాడు. కాగా, స్టార్టర్‌లో తేలిన విద్యుత్ వైర్లను గమనించని రైతుకు షాక్ కొట్టింది. పక్క పలంలో ఉన్న అంజన్న తమ్ముడు రాములు చూసి వచ్చి చూడగా సృహ కోల్పోయి పడి ఉన్నాడు. వెంటనే విషయాన్ని రాములు తన వదిన అయిన అంజన్న భార్య జయమ్మకు సమాచారం అందించాడు. ఇరువురు అంజన్నను చికిత్స నిమిత్తం మక్తల్ ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో అంజన్న మృతి చెందినట్లు ఏఎస్‌ఐ చారి తెలిపారు. మృతునికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. దీంతో అంకెన్‌పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి శవానికి పోస్టుమార్టం నిర్వహించి అంకెన్‌పల్లికి తీసుకెళ్లాడు. అంజన్న మృత్తితో గ్రామంలోని అందరు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్‌ఐ చారి తెలిపారు.
65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- అదుపులో నలుగురు, మూడు వాహనాలు
మానవపాడు, మే 25: అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న నంఘటన శుక్రవారం ఉండవెల్లి మండల పరిధిలోని కలుగొట్ల, టోల్‌గేటు సమీపంలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ రాంచందర్‌జీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల గస్తీ నిర్వహించి తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా బియ్యం రవాణా చేస్తున్న వాహనాలను పొలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా నుంచి బియ్యం అక్రమంగా పొరుగు తెలుగు రాష్ట్రానికి తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఏపీ 22 టీవీ 1010 నంబరు టాటా ఏస్ వాహనంలో 12 క్వింటాళ్ల బియ్యాన్ని ఉండవెల్లి మండలం కలుగొట్ల మీదుగా కర్నూలు తరలిస్తుండగా పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకొని రాంబాబు, రవిలపై కేసు నమోదు చేశారు. టోల్‌గేటు సమీపంలో చేపట్టిన తనిఖీల్లో ఏపీ 02 టీవీ 0011 నంబర్ బొలేరో వాహనంలో 37 క్వింటాళ్ల బియ్యాన్ని అనంతపురం జిల్లాకు చెందిన అమరనాధ్, ఏపీ 03 టీసీ 9047 మినీ డీసీఎం వాహనంలో 16 క్వింటాళ్ల బియ్యాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అంజన్‌కుమార్‌లు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ రాంచందర్ జీ తెలిపారు.