క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, మే 25: ప్రభుత్వం పోలీసులకు అన్ని రకాల వసతులు కల్పించినా వారిలో మార్పు మాత్రం రావడంలేదు. ప్రెండ్లీ పోలీస్ అంటూనే మరోపక్క అరాచకాలను కొనసాగిస్తున్నారు. చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ ఈరోజీ ఒక నిందితుడికి త్వరగా చార్జిషీట్ వేసేలా చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు. అంగీకరించిన బాధితుడు లంచం ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలను ఏసీబీ డీఎస్పీ అచ్చెశ్వర్ రావు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న కార్తీక్ అనే వ్యక్తిపై బాలికను వేధిస్తున్నాడని, ఆ బాలిను కిడ్నాప్ చేశాడంటూ ఒక బాలిక చైతన్యపురి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ ఈరోజీ ఈ కేసులో నీకు అనుగుణంగా చార్జిషీట్ త్వరగా ఇవ్వాలంటే తనకు ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన నిందితుడు కార్తీక్ ఎల్‌బీనగర్ శ్రీనగర్‌కాలనీలో ఇరవై వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దొరికిన నగదును సీజ్ చేసి, పట్టుపడ్డ ఎస్‌ఐ ఈరోజీని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.