క్రైమ్/లీగల్

నకిలీ చెక్కుతో బియ్యం కొనుగోలు చేసిన ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మే 26 : పతంజలి కంపెనీ ప్రతినిధులం అని చెప్పుకుని స్థానిక ఓ బియ్యం వ్యాపారిని బురిడీ కొట్టించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 8న స్థానిక ఎంఎఫ్ రోడ్డులో శ్రీసాయి ట్రేడర్స్ దుకాణంలో యజమని గువ్వల చిరంజీవితో తాము పతంజలి కంపెనీ నుంచి వచ్చామని బెంగళూరుకు చెందిన సీఎన్ లోకేష్, రవినాయక్ తమకు 150 క్వింటాళ్ల బియ్యం కావాలని 27 క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేసి రూ.14.26 లక్షల విలువజేసే బియ్యాన్ని లారీలో లోడ్ చేయించుకుని రూ.78.50 లక్షలకు చెక్కు ఇచ్చి వెళ్లిపోయారు. చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లగా నకిలీగా తేలడంతో ఈనెల 14న బియ్యం వ్యాపారి స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు టూటౌన్ సీఐ తమీమ్ అహ్మద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయగా పెనుకొండ సమీపంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆ లారీ ఉందని పక్కా సమాచారం రాగా లలిత బ్రాండ్‌కు చెందిన 27 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లోకేష్, రవినాయక్‌ను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.
కాగా ముక్కుమోహం తెలియని వ్యక్తుల మాటలు నమ్మి అత్యధిక ధరలు ఇస్తున్నారన్న ఆశతో స్థానికంగా బ్రాంచ్ లేని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్‌ను ఆ వ్యాపారి తీసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అదేవిధంగా లలిత బ్రాండ్‌కు సంబంధించిన బియ్యం ధరలకు అత్యధికంగా వ్యాపారాన్ని కుదుర్చుకోవడం కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 27 క్వింటాళ్ల బియ్యాన్ని రూ.14.26 లక్షలకు ఒప్పందం కుదుర్చుకోవడం బట్టి ఆ బియ్యం ధర ఎంత ఉంటుందోనన్న అనుమానాలతోపాటు ఈ ప్రాంతంలో ఇలాంటి ధరలు ఉన్నాయా అన్న అభిప్రాయాలతోపాటు వ్యాపారులు ముక్కున వేలేసుకుటున్నారు. ఈ ఘటన బియ్యం వ్యాపారుల్లో దుమారం రేపుతుండగా అటు వ్యాపారితోపాటు పోలీసు దర్యాప్తుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.