క్రైమ్/లీగల్
అనుమానంతో వివాహిత హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పెదపూడి, ఫిబ్రవరి 16: అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియురాలిపై అనుమానంతో వివాహిత మహిళను ఆమె ప్రియుడే హత్య చేసి ఎవరికీ అనుమానం కలగకుండా కాలువ గట్టుపై పూడ్చివేసిన ఘటన మండలంలోని అచ్యుతాపురత్రయంలో జరిగింది. దీంతో గ్రామం ఉలిక్కిపడింది. కాకినాడ డీఎస్పీ వర్మ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పగటి వేషాలు వేసే వీరనాల సత్యనారాయణ భార్య చనిపోవడంతో మృతురాలు రాజేశ్వరిని (45) రెండవ వివాహం చేసుకున్నాడని తెలిపారు. అయితే సత్యనారాయణ ముందు భార్య ఐదుగురు సంతానంలో ఒకడైన కుమార్‌రాజా గత రెండేళ్లుగా తన పిన్ని రాజేశ్వరితో అక్రమ సంబంధం నెరుపుతున్నాడని, ఈ నేపధ్యంలో వారిరువురు కరప మండలం గురజనాపల్లి శివారు అడివిపూడిలో గది అద్దెకు తీసుకుని ఏకాంతంగా గడిపేవారన్నారు. అయితే వృత్తిలో భాగంగా ప్రభుత్వ పథకాల ప్రచారానికి బుర్రకథతో పాటు, పగటి వేషాలు, వేసే ఆమె విజయవాడలోని అమ్మ స్వచ్ఛంద సంస్థ వలంటీరుగా పని చేస్తుందని, ఈ నేపధ్యంలో తరచూ బయటకు వెళ్లిపోతుండటంతో తనతో కాకుండా బయట వారితో కూడా ఆమె సంబంధాలు పెట్టుకుంటుందన్న అనుమానంతో రగిలిపోతున్న కుమార్‌రాజా ఆమెను ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నాడని, ఈ మేరకు ఈ నెల 8వ తేదీన ఇద్దరూ అడవిపూడి వెళ్లి అక్కడ గడిపిన అనంతరం ఆమె చేత మద్యం తాగించాడని, అనంతరం మత్తులో ఉన్న రాజేశ్వరిని పొయ్యి ఊదే గొట్టంతో తల వెనుక భాగంలో గట్టిగా కొట్టి నోరు, ముక్కు అదిమి పట్టడంతో ఆమె ఊపిరి ఆడక మృతి చెందిందని, దీంతో శవాన్ని గోనె సంచిలో మూటకట్టి మోటార్ సైకిల్‌పై అచ్యుతాపురత్రయం తరలించి రేపూరు నుంచి కొవ్వూరు వెళ్లే ఏటిగట్టుపై శవాన్ని పూడ్చిపెట్టినట్టు తమ దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు.
పథకం ప్రకారమే హత్య:
రాజేశ్వరిపై అనుమానం పెంచుకున్న కుమార్‌రాజా ఆమెను హత్య చేయడానికి పక్కా పథకాన్ని సిద్ధం చేసుకున్నాడు. సంఘటన జరిగిన ఫిబ్రవరి 8వ తేదీకి నాలుగు రోజుల ముందు నుంచి శవాన్ని పూడ్చడానికి అవసరమైన గొయ్యిని తవ్వి సిద్ధం చేసుకుని మద్యం గొట్టం శవాన్ని బిగించి కట్టడానికి వీలుగా సైకిల్ ట్యూబ్‌లు, గోనె సంచి తదితర సామాగ్రి సిద్ధం చేసుకున్నట్టు తమ విచారణలో తెలిపాడు.
బయటపడిన వాస్తవాలు:
గత వారం రోజులుగా తన భార్య కనిపించకపోవడంతో రెండు రోజుల పాటు గాలించిన సత్యనారాయణ పెదపూడి ఎస్సై కోటూరి కిషోర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో తన బండారం బయటపడుతుందన్న భయంతో కుమార్‌రాజా విషయాన్నంత గ్రామ వీఆర్వో రెడ్డిపల్లి సత్యనారాయణకు తెలియచేశాడు. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని వెంట బెట్టుకుని ఏటిగట్టుపై పూడ్చిన శవాన్ని వెలికి తీశారు. అనంతరం డీఎస్పీ వర్మ, పెదపూడి తహసీల్దార్ మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి సీఐ రాజశేఖర్, ఎస్సై కిషోర్ బాబు, వీఆర్వో, మృతురాలి బంధువుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అలాగే కాకినాడ జీజీహెచ్ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.