క్రైమ్/లీగల్

హత్యకేసులో మద్దాయి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 26: హత్యకేసులో ముద్దాయిని అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నిందితుల వివరాలను అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వెస్ట్ డిఎస్‌పి సరిత తెలియజేశారు. సెల్‌ఫోన్ మిస్‌డ్ కాల్ ద్వారా పరిచయమైన శ్రీలక్ష్మి అనే యువతిని పొట్టిశ్రీరాములు నగర్‌కు చెందిన అఖిల్ తేజ గత రెండు సంవత్సరాల నుండి ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. ఆమె సంపాదనతో జల్సాలు చేస్తూ మరో యువతిని ట్రాప్ చేశాడు. గత నెల 19వ తేదీన లక్ష్మీని హత్యచేసి హైదరాబాద్ వెళ్లి మరలా గత నెల 28వ తేదీన గుంటూరు వచ్చి లక్ష్మీ కనబడటం లేదని ఏడుస్తూ అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఎస్‌ఐ తిరుపతిరావు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డాక్టర్ల రిపోర్టు మేరకు హత్యకేసుగా పోలీసులు గుర్తించారు. దీంతో అర్బన్ ఎస్‌పి విజయారావు ఆదేశాల మేరకు వెస్ట్ డిఎస్‌పి సరిత పర్యవేక్షణలో అరండల్‌పేట సిఐ వై శ్రీనివాసరావు దర్యాప్తులో భాగంగా ఈ హత్య అఖిల్ చేసినట్లుగా దొరికిన ఆధారాలతో శనివారం అరండల్‌పేట 1వ లైను రైల్వేకల్యాణ మండపం వద్ద అరెస్ట్ చేసి సెల్‌ఫోన్ స్వాధీనం చేశారు.